పదవీ విరమణ వయస్సు పెరగనుందా?

ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది.

Update: 2020-02-01 09:02 GMT

ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. పదవీవిరమణ వయస్సును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 58 ఏళ్లుగా ఉన్న విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంచినట్టు సూత్ర ప్రాయ ప్రకటన చేసింది. ఈ నిర్ణయాన్ని ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు సమాచారం. దీంతో ఈ ఏడాది విరమణ పొందే ఉద్యోగుల్లో ఆనందం నెలకొంది.

దీనికి సంబంధించిన పూర్తి వివరాల ఫైల్ ను వచ్చే మంత్రి వర్గం సమావేశం నాటికి సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ఇక పోతే పదవీ విరమణ వయస్సు 61 ఏళ్లకు పెంచినట్టయితే 26,133 మంది ఉద్యోగులకు మూడేళ్ల పాటు అదనపు సర్వీసులు కల్పించినట్టే. వీరందరు కూడా ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి విరమణను తీసుకోనుండగా వయస్సు పెంచడంతో వారంతా 2023 మార్చి 31 వరకు విరమణ పొందుతారు. దీంతో 2023 వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో రిటైర్‌మెంట్లు ఉండవు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్ధిక మాంద్యం ఉండంతో వీరికి చెల్లించవలసిన గ్రాట్యుటీ, పదవీ విరమణ సందర్భంగా ఇచ్చే అన్ని రకాల బెనిఫిట్లకు సంబంధించిన చెల్లింపులు ప్రభుత్వానికి మిగిలినట్టే. ఈ కాలం పొడిగించక పోతే ఈ ఏడాది ప్రభుత్వం ప్రభుత్వం ప్రతినెలా రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల మేర గ్రాట్యుటీ, ఇతర బెనిఫిట్లు చెల్లించాల్సి ఉంటుంది. కానీ రిటైర్ మెంట్ వయస్సు పెంచడంతో ఏడాదికి సగటున రూ.3,500 కోట్లు ప్రభుత్వానికి మిగులుతుంది.

ఇక పోతే కొంత మంది ఉన్నతాది కారులు సీఎం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నారు. వయోపరిమితి పెంచినప్పటికీ 33 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ఈ వర్తించకూడదని అధికారుల కమిటీ సిఫారసు చేసారు. అయినప్పటికీ సీఎం వాటిని పక్కన పెట్టినట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 


Tags:    

Similar News