తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

Update: 2020-05-23 11:36 GMT

తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడులైంది. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడ్డ వివిధ కోర్సుల ప్రవేశ పరీక్షల తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి శనివారం ప్రకటించింది. ఈ ఏడాది ప్రవేశ పరీక్షలన్నింటినీ ఆన్‌లైన్‌లోనే న్విహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఉన్నత విద్యామండలి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

జులై 6 నుంచి 9 వరకు ఎంసెట్ పరీక్ష నిర్వహించనున్నారు.

* జులై 4న ఈసెట్‌

* జులై 13న ఐసెట్

* జులై 15న ఎడ్‌సెట్‌,

* జులై 1 నుంచి 3 వరకు పీజీఈసెట్‌

* జులై 10న లాసెట్‌, లా పీజీసెట్‌;

* జులై 1న పాలీసెట్‌

Tags:    

Similar News