Karnataka లోక్‌సభ ఎన్నికలు: ఉత్తర కర్ణాటకలో రెండో విడత పోలింగ్

Karnataka లోక్‌సభ ఎన్నికలు: ఉత్తర కర్ణాటకలో రెండో విడత పోలింగ్దక్షిణ కర్ణాటకలోని 14 స్థానాల్లో గత నెల 28న పోలింగ్

Update: 2024-05-07 05:31 GMT

Karnataka లోక్‌సభ ఎన్నికలు: ఉత్తర కర్ణాటకలో రెండో విడత పోలింగ్

Karnataka లోక్‌సభ ఎన్నికలు: ఉత్తర కర్ణాటకలో రెండో విడత పోలింగ్ కర్ణాటక రాష్ట్రంలో 28 లోక్‌సభ స్థానాలు ఉండగా... రెండు విడతల్లో పోలింగ్‌ను నిర్వహించాలని ఈసీ భావించింది. అందులో భాగంగా గత నెల 28న కర్ణాటక దక్షిణ ప్రాంత జిల్లాల్లోని 14 స్థానాల్లో పోలింగ్ పూర్తవగా... మిగిలిన 14 స్థానాల్లో ఇవాళ పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇవాళ జరుగుతున్న 14 స్థానాలు ఉత్తర కర్ణాటకలోనివే. 2019 ఎన్నికల్లో ఉత్తర కర్ణాటకలోని మొత్తం 14 నియోజకవర్గాలనూ కాషాయపార్టీ ఊడ్చేసింది. 14 సిట్టింగ్ స్థానాల్లో ఆరుగురు అభ్యర్థులను కమలం పార్టీ మార్చింది. ముంబయి మరాఠాలు, హైదరాబాదీల ప్రభావం అధికంగా ఉండే ఉత్తర కర్ణాటకలోని 14 లోక్‌సభ నియోజకవర్గాల్లో లింగాయత్‌ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

మహారాష్ట్రకు అతి సమీపంగా ఉండే బెళగావి, చిక్కోడి జిల్లాల్లో మరాఠా ఓటర్లు కనీసం 10శాతం ఉంటారు. కర్ణాటక ప్రభుత్వం మరాఠా సంఘాలను నిషేధించడం, మహారాష్ట్ర రాజకీయ నేతలను రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకోవడంతో ఈ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇక తెలుగు ప్రజలు బలంగా ప్రభావితం చూపే నియోజకవర్గం బళ్లారి. ఇక్కడ అహింద ఓట్లే కీలకం. ఎస్సీ, ఎస్టీలు 40శాతానికి పైగా ఉన్న ఈ నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల ఆధిపత్యం సమానంగా కొనసాగుతుంటుంది.

మొత్తంగా మూడోదశలో ఉత్తర కన్నడలో ఎన్నికలు ఇటు ఏఐసీసీ ఛీఫ్ ఖర్గేకు, ప్రధాని మోడీకి కీలకం కానున్నాయి. అటు ఏఐసీసీ చీఫ్‌గా ఖర్గే బాధ్యతలు చేపట్టిన తర్వాత వచ్చిన తొలి లోక్‌సభ ఎన్నికలు కావడం.. మరోవైపు మొదటి నుంచి కమలం పార్టీ కంచుకోటగా పేరున్న కర్ణాటకను మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం.. ఎన్నికల ఫలితాలపై ఆసక్తిని పెంచాయి.

Tags:    

Similar News