కేంద్రం మార్గదర్శకాలను అనుసరించి తెలంగాణలో ఈరోజు నుంచి మద్యం దుకాణాలు తెరిచారు. సీఎం కేసీఆర్ నిన్న జరిగిన క్యాబినెట్ భేటీలో ఈ కీలక నిర్ణయం తీసుకుని, తరువాత మీడియాకు వివరించిన సంగతి తెలిసిందే. ఇదే సందర్భంలో మద్యం ధరలను పెంచుతున్నట్టు ప్రకటించారు.
ఈ మేరకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మద్యం ధరల పెంపు పై వివరాలు వెల్లడించింది. దాని ప్రకారం మద్యం రకాన్ని అనుసరించి.. బాటిల్ పరిమాణాన్ని అనుసరించి ధరల పెంపుదలను నిర్ణయించారు. దాని ప్రకారం చీప్ లిక్కర్ ధర 11 శాతం పెరుగింది. అదేవిధంగా మధ్యరకం, ఖరీదైన రకం మద్యం ధరలు 16 శాతం మేర పెరిగాయి. బీరును మినహాయించి మద్యాన్ని నాలుగు విభాగాలుగా విభజించారు. ఆర్దనరీ, మీడియం, ప్రీమియం, స్కాచ్ లుగా ఈ మద్యం రకాలని విభజించి ధరల పెంపుదలను వర్తింప చేశారు. దీని ప్రకారం పెరిగిన మద్యం ధరలు ఇలా ఉన్నాయి..