Night Curfew: నైట్ కర్ఫ్యూ పటిష్టంగా అమలు చేయాలి- డీజీపీ ఆదేశాలు
Night Curfew: కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కర్ఫ్యూ కోసం పట్టిష్ట చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖకు డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు.
Night Curfew: నైట్ కర్ఫ్యూ పటిష్టంగా అమలు చేయాలి- డీజీపీ ఆదేశాలు
Night Curfew: కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కర్ఫ్యూ కోసం పట్టిష్ట చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖకు డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు. పోలీస్ సిబ్బంది, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన సిబ్బందికి డీజీపీ దిశా నిర్దేశం చేశారు. నైట్ కర్ఫ్యూ పటిష్టంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కర్ఫ్యూ అమలులో ఉన్న సమయంలో పౌరులతో దురుసుగా ప్రవర్తించరాదన్నారు. కర్ఫ్యూ గురించి ప్రజలకు వివరంగా చెప్పాలన్నారు. మినహాయింపు ఉన్నవారు సెల్ఫ్ ఐడెంటిటీ కార్డు చూపించాలన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంపై ఎస్ఈసీ ఆదేశాలను పాటించాలన్నారు.