తెలంగాణలో మళ్లీ మంత్రుల మధ్య వార్..

Telangana: తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ మంత్రుల మధ్య అంతర్గత కలహాలు బయటపడ్డాయి.

Update: 2025-10-11 12:15 GMT

తెలంగాణలో మళ్లీ మంత్రుల మధ్య వార్..

Telangana: తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ మంత్రుల మధ్య అంతర్గత కలహాలు బయటపడ్డాయి. అడ్లూరి లక్ష్మణ్‌, పొన్నం ప్రభాకర్ మధ్య వివాదం చల్లారకముందే, మరో కొత్త లొల్లి వెలుగులోకి వచ్చింది. మేడారం అభివృద్ధి టెండర్ల విషయంలో వరంగల్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటిపై కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

వరంగల్ రాజకీయాలతో పాటు దేవాదాయ శాఖ వ్యవహారాల్లో కూడా పొంగులేటి జోక్యం చేసుకుంటున్నారని కొండా దంపతులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయం మీద కొండా మురళి నేరుగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఫోన్ చేసి వివరించారు. పొంగులేటి తన సొంత కంపెనీకి పనులు కేటాయించుకుంటున్నారని, జిల్లా అభివృద్ధి వ్యవహారాల్లో తామే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. అదేవిధంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రాష్ట్ర ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లినట్టు చెప్పారు. హైకమాండ్ ఈ ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

Tags:    

Similar News