టీపీసీసీ చీఫ్ దగ్గరకు మంత్రుల వ్యాఖ్యల పంచాయితీ
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో దళిత ఎమ్మెల్యేలు సమావేశయ్యారు.
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో దళిత ఎమ్మెల్యేలు సమావేశయ్యారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను తన వ్యాఖ్యలతో మంత్రి పొన్నం అవమానించారనే ఎపిసోడ్‌పై చర్చించారు. ఈ విషయంపై ఇప్పటికే మంత్రి పొన్నం, అడ్లూరి లక్ష్మణ్‌లతో మాట్లాడానని.. సమస్య సద్దుమనిగిందని చెప్పుకొచ్చారు. రేపు మరోసారి ఇద్దరు మంత్రులను పిలిచి మాట్లాడుతున్నట్టు పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ వివరించారు. మహేష్‌కుమార్‌ను కలిసిన వారిలో కవంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, శామ్యూల్, లక్ష్మీకాంత్, కాలే యాదయ్యలు ఉన్నారు.