లక్ష్యానికి మించి తెలంగాణ కాంగ్రెస్ సభ్యత్వ నమోదు
Telangana Congress Membership: లక్ష్యానికి మించి తెలంగాణ కాంగ్రెస్ సభ్యత్వ నమోదు, ఏఐసీసీ నుంచి అభినందనలు.
లక్ష్యానికి మించి తెలంగాణ కాంగ్రెస్ సభ్యత్వ నమోదు
Telangana Congress Membership: లక్ష్యానికి మించి తెలంగాణ కాంగ్రెస్ సభ్యత్వాలు నమోదయ్యాయి. సుమారు 31 లక్షలు దాటాయి తెలంగాణ కాంగ్రెస్ సభ్యత్వాలు. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ రేవంత్, డీసీసీ అధ్యక్షులు, సీనియర్ ఉపాధ్యక్షులతో ఏఐసీసీ ఇంఛార్జ్ సమావేశంకానున్నారు. మరింత సభ్యత్వం చేయాలని.. బూత్‌లతో వందకు తగ్గకుండా, మండలాల్లో 10వేలు, నియోజకవర్గంలో 50 వేల చొప్పున సభ్యత్వం చేయించే దిశగా టీపీసీసీ ప్రయత్నాలు చేస్తోంది. సభ్యత్వాలలో టార్గెట్ పూర్తి చేసిన వారిని ఏఐసీసీ తెలంగాణ ఇంఛార్జ్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సన్మానించనున్నారు.