Congress: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతల భేటీ
Congress: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు భేటీ అయ్యారు.
Congress: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతల భేటీ
Congress: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల చట్టానికి ఆమోద ముద్ర వేసిన గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం దేశానికి రోల్ మోడల్‌గా నిలిచిందని.. బీసీలకు రాజకీయ విద్యా ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు చట్టం చేసి చరిత్ర సృష్టించిందన్నారు కాంగ్రెస్ నేతలు.
ఎన్నడూ కులగణన గురించి ఆలోచించని బీజేపీ నేతలు,.. తెలంగాణను మోడల్‌గా తీసుకుని కేంద్రం కులగణన చేపడుతుంటే జీర్ణించుకోలేక విమర్శలు చేస్తున్నారంటూ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం కులగణన చేసి ప్రామాణికంగా స్పష్టమైన లెక్కల్ని వెల్లడించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ విషయంలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఎవరెన్ని మాట్లాడినా... కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి వల్లే కేంద్రం జనగణన, కులగణన చేపడుతోందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు.