మేడారంలో నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్‌

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మేడారం చేరుకున్నారు. సమ్మక్క-సారలమ్మను ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Update: 2025-09-23 07:27 GMT

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మేడారం చేరుకున్నారు. సమ్మక్క-సారలమ్మను ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు. కాసేపట్లో మేడారం మహాజాతర ఏర్పాట్లను సీఎం రేవంత్ పరిశీలించనున్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన మేడారం జాతర మరింత ఘనంగా నిర్వహించేందుకు ప్రజా ప్రభుత్వం సిద్ధమైంది.

ఇందుకోసం 150 కోట్ల వ్యయంతో సమ్మక్క సారలమ్మ మహాజాతర పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం.. మేడారం పూజారులు, ఆదివాసి పెద్దలు, మంత్రులు, ప్రజాప్రతినిధులతో జాతర నిర్వాహణ, కొత్త నిర్మాణాలపై సీఎం సమీక్షిస్తారు.

Tags:    

Similar News