Revanth Reddy: ఇవాళ ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్

Revanth Reddy: పార్టీ అధిష్టానం నేతలతో భేటీ కానున్న సీఎం

Update: 2024-04-11 03:16 GMT

Revanth Reddy: ఇవాళ ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనన్నారు. సాయంత్రం పార్టీ అధిష్టానం నేతలను కలువనున్నారు. పెండింగ్ లో ఉన్న హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం లోక్ సభ అభ్యర్ధుల ఎంపికపై చర్చించే అవకాశం ఉంది. తుక్కుగూడలో నిర్వహించిన జన జాతర సభ విజయవంతం కావండతో మంచి జోష్ పై ఉన్న సీఎం రేవంత్ రెడ్డి... లోక్ సభ ఎన్నికల ప్రచారానికి పార్టీ పెద్దలను రావాలని ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది.

మే మొదటి వారంలో పార్టీ జాతీయ ప్రదాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారానికి వస్తారని ఇప్పటికే ప్రకటించారు. ఢిల్లీ వెళ్లే ముందు రంజాన్ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నివాసంలో విందుకు హాజరు కానున్నారు. అక్కడి నుంచి నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీ వెళ్లనున్నట్టు సీఎంవో వర్గాలు వెల్లడించాయి.

Tags:    

Similar News