Revanth Reddy: భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎస్, ఉన్నతాధికారులతో వర్ష ప్రభావంపై సమీక్ష చేపట్టిన సీఎం.. పలు సూచనలు చేశారు. లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సిటీలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు తెలిపారు. హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ, హైడ్రాతో పాటు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని.. ఆ దిశగా సంబంధిత అధికారులను అప్రమత్తం చేయాలని సీఎస్‌కు ఆదేశాలిచ్చారు.