Telangana: హోం క్వారంటైన్ ముగిసిన వెంటనే రంగంలోకి సీఎం కేసీఆర్...

Telangana: తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులతో పాటు మృతుల సంఖ్య పెరుగుతోంది. ఆసుపత్రుల్లో ఆక్సిజన్, బెడ్ ల కొరత వేధిస్తోంది.

Update: 2021-04-30 12:45 GMT

Telangana: హోం క్వారంటైన్ ముగిసిన వెంటనే రంగంలోకి సీఎం కేసీఆర్...

Telangana: తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులతో పాటు మృతుల సంఖ్య పెరుగుతోంది. ఆసుపత్రుల్లో ఆక్సిజన్, బెడ్ ల కొరత వేధిస్తోంది. మే 1 నుంచి అందరికీ ఉచిత టీకా కార్యక్రమం ప్రారంభం కానుంది. సీఎం కేసీఆర్ హోం క్వారంటైన్ ముగిసి ఎప్పుడు రంగంలోకి దిగుతారా అని అధికారులు ఎదురుచూస్తున్నారు.

తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రాత్రి వేళ కర్ఫ్యూ విధించినా పరిస్థితి అదుపులోకి రావడంలేదు. ఆక్సిజన్ , బెడ్స్ కొరత వేధిస్తున్నా రాష్ట్రంలో కేసులు తగ్గుతున్నాయని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మాటలు విస్మయం కలిగిస్తున్నాయి. కరోనాతో హోంక్వారంటైన్ లో ఉన్న సీఎం కేసీఆర్ మానిటరింగ్ చేస్తున్నా పరిస్థితులు చక్కబడడంలేదు.

హోం క్వారంటైన్ ముగిసిన వెంటనే సీఎం కేసీఆర్ ఫార్మ్ హౌస్ నుంచి ప్రగతి భవన్ రానున్నారు. వెంటనే రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యలపై అధికారులతో సమావేశం నిర్వహిస్తారని తెలుస్తోంది. నైట్ కర్ఫ్యూ కొనసాగిస్తూ పగటిపూట కఠిన నిబంధనలు పెట్టడంపై అధికారులతో ఆయన చర్చించనున్నారు. కరోనా కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్ల విధింపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,35,606కి చేరింది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుంది. మరోవైపు మే 1 నుంచి అందరీకి ఉచిత వ్యాక్సిన్ ఇస్తున్న నేపథ్యంలో కొరత ఏర్పడితే ఏంచేయాలన్నదానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం అయ్యేసరికి అందరికీ సర్దుబాటు అయ్యేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ చెబుతున్నారు. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ వచ్చిన తర్వాత కరోనా కట్టడి చర్యలు ముమ్మరం అవుతాయని అధికారులు భావిస్తున్నారు.

Tags:    

Similar News