Chandigarh: ఉత్తరాదిన మీటర్ల ఇష్యూ లేవనెత్తిన కేసీఆర్..

Chandigarh: ఉత్తరాది రాష్ట్రాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది.

Update: 2022-05-22 14:30 GMT

Chandigarh: ఉత్తరాదిన మీటర్ల ఇష్యూ లేవనెత్తిన కేసీఆర్..

Chandigarh: ఉత్తరాది రాష్ట్రాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో విందు భోజనం తర్వాత చండీగఢ్ చేరుకున్నారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ తో కలిసి రైతు ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలను, గాల్వాన్ సరిహద్దు ఘర్షణల్లో అమరులైన సైనిక కుటుంబాలను కేసీఆర్ పరామర్శించారు. ఆరు వందల కుటుంబాలకు మూడు లక్షల రూపాయల చొప్పున ఆర్దిక సహాయం అందించారు. స్వాంతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినా ఇంకా ఇలాంటి సమావేశాలు నిర్వహించుకోవడం బాధాకరమన్నారు.

రైతు సమస్యలకు ఇంకా పరిష్కారం దొరకడం లేదన్నారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకు వచ్చి రైతులు తమ డిమాండ్లను పరిష్కరించుకున్నారన్నారు. సాగు చట్టాలను రద్దు చేసుకున్నారని తెలిపారు. కేంద్రం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు రైతులంతా ఏకతాటిపైకి రావాలన్నారు. ప్రభుత్వాలను మార్చే శక్తి రైతులకు ఉందని స్పష్టం చేశారు. తాము ఒంటరయ్యామని రైతు కుటుంబాలు ఆందోళన చెందవద్దని కేసీఆర్ ఓదార్పునిచ్చారు. కేంద్ర సర్కార్‌ వ్యవసాయంపై ఇప్పటికీ ఆంక్షలు విధిస్తోందని సాగుకు ఉచితంగా విద్యుత్‌ అందిస్తుంటే మీటర్లు పెట్టాలంటోందని విమర్శించారు. భాజపాను ప్రశ్నిస్తుంటే దేశ ద్రోహులనే ముద్ర వేస్తున్నారని కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News