KCR Review Meeting on Irrigation: సోమ, మంగళవారాల్లో కేసీఆర్ సమీక్షలు..

KCR Review Meeting on Irrigation: గోదావరి, కృష్ణా నదుల మధ్య ఉన్న జీవగడ్డ తెలంగాణ కాబట్టి, ఈ ప్రాంతానికి పుష్కలమైన నీటి వసతి కల్పించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారు.

Update: 2020-07-19 13:30 GMT
KCR (File Photo)

KCR Review Meeting on Irrigation: గోదావరి, కృష్ణా నదుల మధ్య ఉన్న జీవగడ్డ తెలంగాణ కాబట్టి, ఈ ప్రాంతానికి పుష్కలమైన నీటి వసతి కల్పించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారు. ఈ మేరకు రాష్ర్టంలో రెండు కీల‌క‌మైన ఇంజినీరింగ్ విభాగాల ముఖ్యుల‌తో సీఎం రేపు, ఎల్లుండి విస్ర్త‌త‌స్థాయి స‌మావేశాలు నిర్వ‌హించ‌నున్నారు. రేపు అంటే సోమవారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి నీటి పారుద‌ల‌శాఖ‌పై అదేవిధంగా ఎల్లుండి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ఆర్అండ్‌బీశాఖ‌పై స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది.

స‌మ‌గ్ర అవ‌గాహ‌న‌తో ప్ర‌ణాళిక‌లు వేసి వాటిని అమ‌లు చేయ‌డంతో ప్ర‌త్యేక రాష్ర్టంగా ఏర్ప‌డిన ఆరేళ్ల‌లోనే నీటి పారుద‌ల‌రంగంలో తెలంగాణ అద్భుత విజ‌యాలు సాధించింద‌న్నారు. సమైక్య రాష్ట్రంలో నీటి పారుదల రంగంలో తెలంగాణ దారుణమైన ప్రాంతీయ వివక్షకు గురైందని తెలిపారు. తెలంగాణ ప్ర‌భుత్వం భారీ ప్రాజెక్టుల నిర్మాణం చేప‌ట్ట‌డం, చెరువులు పున‌రుద్ధ‌రించ‌డం వంటి చ‌ర్య‌ల‌తో సాగునీటి స‌మ‌స్య శాశ్వ‌తంగా ప‌రిష్కార‌మ‌వుతుంద‌ని తెలిపారు. సమగ్ర అవగాహనతో ప్రణాళికలు వేసి, వాటిని అమలు చేయడం వల్ల ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ఆరేళ్లలోనే తెలంగాణ రాష్ట్రం నీటి పారుదల రంగంలో అద్భుత విజయాలు సాధించింది. దీని ద్వారా ఆయకట్టు పెరుగుతున్నది. వ్యవసాయం విస్తరించింది.

చెరువులు పునరుద్ధరించింది. సాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతున్నది. భారీ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది. సాగునీటి లభ్యత పెరిగి పంటలు పుష్కలంగా పండుతున్నాయి. తెలంగాణ గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా రూపుదిద్దుకుంటున్నది. 2019-20 యాసంగిలో తాము సేకరించిన ధాన్యంలో తెలంగాణ నుంచే దాదాపు 55 శాతం ధాన్యం వచ్చిందని స్వయంగా ఎఫ్.సి.ఐ. ప్రకటించడం తెలంగాణ రాష్ట్రం వ్యవసాయంలో సాధించిన పురోగతికి ఓ నిదర్శనం. ఈ నేప‌థ్యంలో సాగునీటిశాఖ ప్రాధాన్య‌త‌ను పున‌ర్వ్య‌వ‌స్థీక‌రించి బ‌లోపేతం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. సీఈ ప‌రిధిలోనే ప్రాజెక్టులు, రిజ‌ర్వాయ‌ర్లు, లిఫ్టులు, కాలువ‌లు, చెరువులు, చెక్‌డ్యాంలు స‌మ‌స్తం ఉంటాయ‌న్నారు. ప్రస్తుతం నీటి పారుదల శాఖ చిలువలు, పలువలుగా ఉంది. భారీ, మధ్యతరహా, చిన్న తరహా, ఐడిసి, ప్రాజెక్టులు, ప్యాకేజీలు పేరుతో విభజించి ఉంది.


Tags:    

Similar News