మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీ భారీ మోసం.. ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులకు కుచ్చుటోపీ
మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీ భారీ మోసానికి పాల్పడింది.
మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీ భారీ మోసం.. ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులకు కుచ్చుటోపీ
మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీ భారీ మోసానికి పాల్పడింది. మెడికల్ కోడింగ్‌లో ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగుల దగ్గర లక్షల్లో డబ్బులు వసూలు చేసి ఘరానా మోసానికి పాల్పడింది. ఒక్కొక్క నిరుద్యోగి దగ్గర దాదాపు 2 లక్షల నుంచి వసూలు చేశారు. అనంతరం ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో బాధితులు మాదాపూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.