నేడు సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం.. కీలక నిర్ణయాలకు అవకాశం
తెలంగాణలో రాష్ట్రంలో లాక్‌డౌన్ గడువు ఈ నెల 31న ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రులు, ఉన్నతాధికారులతో జరిగే సమీక్ష సమావేశం జరగనుంది.
తెలంగాణలో రాష్ట్రంలో లాక్‌డౌన్ గడువు ఈ నెల 31న ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రులు, ఉన్నతాధికారులతో జరిగే సమీక్ష సమావేశం జరగనుంది.రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తి తీరుపై చర్చించడంతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై కూడా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సారి ఎక్కువ సడలింపులు ఇచ్చేందుకు మొగ్గు చూపుతోందని తెలిస్తోంది.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోనూ కేసులు నమోదవుతున్నాయి. కరోనా తీవ్రత కొనసాగుతోంది. చాలా రోజుల తర్వాత మేడ్చల్, సూర్యాపేట, వికారాబాద్, నల్గొండ, నారాయణపేట జిల్లాల్లో మంగళవారం కేసులు నమోదుకావడం ఆందోళనకరంగా మారింది. కోవిడ్ నియంత్రణపై పూర్తిస్థాయిలో దృష్టిసారించేందుకు వీలుగా ప్రభుత్వం చర్యలను ప్రకటించనుంది.
లాక్ డౌన్ నాలుగో దశ మినహాయింపుల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు సడలింపులు ఇచ్చింది. పరిమితంగా రైళ్లు, విమానాల రాకపోకలు సాగుతున్నాయి. సినిమాల షూటింగులు జూన్ నుంచి సాగనున్నాయి. రాష్ట్ర అవతరణ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
ఈ సమావేశంలో హైదరాబాద్‌లో సిటీ బస్సు సర్వీసులు, మెట్రో రైళ్లకు అనుమతిపైనా సమాలోచనలు జరుగుతున్నాయి. పదో తరగతి పరీక్షల నిర్వహణ, ఇంటర్మీడియట్ ఫలితాల వెల్లడిపైనా సమావేశం చర్చించనుంది. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.