కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ భోగస్ : కేసీఆర్

తెలంగాణ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఅర్ ప్రకటించారు.

Update: 2020-05-18 15:41 GMT

తెలంగాణ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఅర్ ప్రకటించారు. ఈ మేరకు సుదీర్ఘ కేబినెట్‌ భేటీ అనంతరం ప్రగతి భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనాతో కలిసి జీవించాల్సిందే అన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పై కేసీఆర్ ఫైరయారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ భోగస్ అని మండిపడ్డారు. కేంద్రానిది పచ్చి మోసం, దగా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాలపై పెత్తనం చేలాయిస్తానంటే నడవదని, కేంద్రం దారుణంగా బిహేవ్ చేస్తోందని దుయ్యబట్టారు.

కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు ఫ్యూడల్ విధానంలో ఉన్నాయని, ఇదేనా రీఫార్మ్స్ చేసే పద్దతి అని ప్రశించారు. కేంద్రం పెట్టిన షరతులకు అందరూ నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రం రాష్ట్రాలతో వ్యవహరించే పద్దతి ఇది కాదని అన్ని కేంద్రం ఆధీనంలో ఉంటే ఇక రాష్ట్రాలు ఎందుకు? అని నిలదీశారు. కేంద్రం సహకరించకున్నా తట్టుకొని నిలబడుతామని కేసీఆర్ ధీమా వ్యక్తంచేశారు.


Tags:    

Similar News