CM KCR: పబ్లిక్ గార్డెన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
CM KCR: అనంతరం రాష్ట్ర ప్రజలనుద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగం
CM KCR: పబ్లిక్ గార్డెన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
CM KCR: సెప్టెంబర్ 17ను పురస్కరించుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జాతీయ సమైక్యతా దినోత్సవం నిర్వహిస్తున్నారు. నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లో వేడుకలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 10 గంటల 45 నిమిషాలకు గన్ పార్క్ వద్ద అమరుల స్థూపానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించనున్నారు. అనంతరం అక్కడి నుంచి నాంపల్లి పబ్లిక్ గార్డెన్ కు గులాబీ బాస్ చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు జాతీయజెండాను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత పోలీసుల గౌరవ వందనం స్వీకరించనున్నారు. అనంతరం జాతీయ సమైక్యతా దినోత్సవ సంబరాల్లో పాల్గొని, రాష్ట్ర ప్రజలనుద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు.