Telangana CM KCR Condolence to Ramaswamy: మాజీ మంత్రి రామ‌స్వామి మృతి.. సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

Telangana CM KCR Ccondolence to Ramaswamy: తెలంగాణ బీజేపీ నాయకుడు, రాష్ట్ర మాజీ మంత్రి, మ‌హారాజ్ గంజ్ మాజీ ఎమ్మెల్యే పీ రామ‌స్వామి(87) క‌న్నుమూశారు.

Update: 2020-07-10 05:30 GMT

Telangana CM KCR Ccondolence to Ramaswamy: తెలంగాణ బీజేపీ నాయకుడు, రాష్ట్ర మాజీ మంత్రి, మ‌హారాజ్ గంజ్ మాజీ ఎమ్మెల్యే పీ రామ‌స్వామి(87) క‌న్నుమూశారు... గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అయన జూబ్లిహిల్స్ అపోలో హాస్సిటల్ లో చికిత్స పొందుతూ రాత్రి గుండెపోటుతో మృతిచెందారు. మహారాజ్‌గంజ్‌ నియోజకవర్గం నుంచి రెండు సార్లు రామస్వామి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతేకాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా కూడా అయన సేవ‌లందించారు. ఆయనకి భార్య, ఐదుగురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నాడు.. అయన మరణం పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

మాజీ మంత్రి పి.రామస్వామి మరణానికి గౌరవ పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా ఆయన చేసిన సేవలను సిఎం గుర్తు చేసుకున్నారు. అయన కుటుంబ సభ్యులకు సిఎం సంతాపం తెలిపారు .ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా నిరాఢంబరమైన జీవితం గడిపిన రామస్వామి, నిజాయితీగా ప్రజలకు సేవలందించి మచ్చలేని రాజకీయ నాయకుడని అన్నారు. అయన మరణం రాష్ట్రానికి తీరని లోటు అని అన్నారు.

ఇక మంత్రి హరీష్ రావు కూడా పి.రామస్వామి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. " తొలిదశతెలంగాణ ఉధ్యమకారుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా సేవలందించిన శ్రీ పి.రామస్వామిగారి మృతి తెలంగాణ సమాజానికి తీరనిలోటు. వారికుటుంభసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. విద్యార్థి దశ నుంచే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేశారు. రాష్ట్రం ఏర్పడేంత వరకు గడ్డం తీయనని1969 దీక్ష చేపట్టారు." అని హరీష్ రావు పేర్కొన్నారు. ఇక అటు రామస్వామి మృతి పట్ల బీజీపీ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ దత్తాత్రేయ, మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు కూడా సంతాపం తెలిపారు.




Tags:    

Similar News