Minister Harish Rao Precautions for Coronavirus: గోరు వెచ్చని నీళ్లు తాగితే సగం ఫికర్‌ తగ్గుతుంది

Minister Harish Rao Precautions for Coronavirus:  గోరు వెచ్చని నీళ్లు తాగితే సగం ఫికర్‌ తగ్గుతుంది
x
Harish Rao (File Photo)
Highlights

Minister Harish Rao Precautions for Coronavirus: కరోనా వైరస్‌ సోకాలని ఎవరూ కోరుకోరని, అందరూ జాగ్రత్త పడుతూ.. మన జాగ్రత్తలో మనం ఉండాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు.

Minister Harish Rao Precautions for Coronavirus: కరోనా వైరస్‌ సోకాలని ఎవరూ కోరుకోరని, అందరూ జాగ్రత్త పడుతూ.. మన జాగ్రత్తలో మనం ఉండాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సూచించారు. సిద్దిపేట మున్సిపల్‌ పరిధిలోని ఆరో వార్డులో రూ.2.20కోట్ల వ్యవయంతో నిర్మించనున్న సీసీరోడ్ల నిర్మాణ పనులను గురువారం మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సుతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం రూ.15 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన ప్రభుత్వ యునాని దవాఖానను ప్రారంభించారు. ఈ ఆస్పత్రికి అవసరమైన అంశాలపై చర్చిస్తూ త్వరితగతిన ఆమోదం ఇవ్వాలని ఫోన్ లైనులో ఉన్నతాధికారులను ఆదేశించారు. పట్టణంలోని 26వ మున్సిపల్ వార్డులో రూ.15 లక్షల వ్యయంతో కాలనీ కమ్యూనిటీ హాల్ కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు మంత్రి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా అంటే నిర్లక్ష్యం వద్దనీ, భయపడొద్దని పూర్తి జాగ్రత్తతో ఉండాలని ప్రజలకు సూచించారు.

కరోనా పాజిటివ్‌ వస్తే ఏదో తప్పు చేసిన వారిలా చిన్నచూపు చూడకుండా ప్రేమ చూపాలన్నారు. ఎవరికీ వైరస్‌ సోకొద్దని కోరుదామన్నారు. కరోనా సోకిన బాధితులకు ధైర్యం చెప్పాలని, దీంతో రెండు రోజులు ఎక్కువ బ్రతికే అవకాశం ఉంటుందన్నారు. కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చిన వారు మానసికంగా బాధపడుతుంటారని, సూటిపోటి మాటలతో ఇంకా కుంగిపోయి బలహీనపడుతున్నారని చెప్పారు. ప్రజలు అవసరమైతే తప్పితే ఇంట్లో నుంచి బయటకు రావొద్దని సూచించారు. కరోనా వైరస్ ను అడ్డుకోవడానికి ప్రజలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

పసుపు, మిరియాలు వేసి ముఖానికి ఆవిరి పట్టుకోవాలని, రోజుకు రెండు మూడు సార్లు చేయాలని, నిమ్మరసం తాగాలని సూచించారు. ఉదయం, మధ్యాహ్నం భోజనం వేళ అన్ని సమయాల్లో గోరు వెచ్చని నీళ్లు తాగితే సగం ఫికర్‌ తగ్గుతుందన్నారు. ఈ నెల 15న కరోనా పరీక్షా కేంద్రం ప్రారంభిస్తామని, వంద మందికి సేవలందించేలా కొవిడ్‌ ఆసుప్రతి ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇలా చేయడం ద్వారా మనల్ని మనం రక్షించుకున్న వారమవుతామంటూ సూచనలు చేశారు. 20 పడకలతో ఐసీయూ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories