Telangana BJP: మరోసారి కమలం పార్టీలో కయ్యాలు.. పార్టీ అధ్యక్షుడిపై నేతల్లో అసంతృప్తి..?

Telangana BJP: తెలంగాణ బీజేపీ నేతల తీరు మరోసారి చర్చనీయంగా మారింది.

Update: 2025-11-25 09:00 GMT

Telangana BJP: తెలంగాణ బీజేపీ నేతల తీరు మరోసారి చర్చనీయంగా మారింది. ఓ వైపు అంతర్గత విభేదాలు లేవంటూనే పార్టీ నిర్వహిస్తోన్న సమావేశానికి కీలక నేతలు డుమ్మా కొట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలపై నోటిఫికేషన్‌ రానున్న నేపథ్యంలో టీబీజేపీ చీఫ్ రామచందర్‌రావు నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 140 మందికి ఆహ్వానం పంపారు. అయితే తీరా సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు.

సీనియర్ నేతలు, ఎంపీలు గైర్హాజరయ్యారు. దాంతో పంచాయతీ ఎన్నికలను బీజేపీ లైట్‌గా తీసుకుందా? లేక నేతల్లో టీబీజేపీ చీఫ్‌పై అసంతృప్తి మొదలైందా? అన్న చర్చ మొదలైంది. మరోవైపు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండి.. కేవలం ప్రెస్‌మీట్‌లు విమర్శలకే నేతలు పరిమితం అయితే ఎలా అంటూ పార్టీ కేడర్ నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతోంది. 

Tags:    

Similar News