Cough Syrups: తెలంగాణలో రెండు దగ్గు మందులపై నిషేధం
Cough Syrups: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 'రీలైఫ్' (Relief), 'రెస్పీఫ్రెష్-టీఆర్' (Respifresh-TR) అనే రెండు దగ్గు మందుల విక్రయాలను తక్షణమే నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Cough Syrups: తెలంగాణలో రెండు దగ్గు మందులపై నిషేధం
Cough Syrups: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 'రీలైఫ్' (Relief), 'రెస్పీఫ్రెష్-టీఆర్' (Respifresh-TR) అనే రెండు దగ్గు మందుల విక్రయాలను తక్షణమే నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు ఔషధాలలో కల్తీ (adulteration) జరిగినట్లు గుర్తించిన కారణంగా ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మందులు గుజరాత్‌కు చెందిన ఫార్మా కంపెనీల ద్వారా తయారవుతున్నట్లు తెలిసింది.
ఇటీవల మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ రాష్ట్రాల్లో ‘కోల్డ్‌రిఫ్’ (Coldriff) అనే దగ్గు మందును వాడటం వలన పలువురు చిన్నారులు మరణించినట్లు ఆరోపణలు రావడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.
ఈ నేపథ్యంలో, రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఔషధ నియంత్రణ విభాగం (DCA) అప్పటికే ‘కోల్డ్ రిఫ్’ దగ్గు మందును పూర్తిగా నిషేధించింది. తాజాగా, మరో రెండు మందుల్లో కల్తీని గుర్తించడంతో, వాటిని కూడా నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.