Telangana Assembly: మూడు రోజుల విరామం తర్వాత అసెంబ్లీ ప్రారంభం..సీఎం రేవంత్ ప్రవేశపెట్టనున్న 4 బిల్లులు
మూడు రోజుల విరామం అనంతరం తెలంగాణ శాసనసభ సమావేశాలు ఇవాళ (జనవరి 02, శుక్రవారం) తిరిగి ప్రారంభమయ్యాయి.
Telangana Assembly: మూడు రోజుల విరామం తర్వాత అసెంబ్లీ ప్రారంభం..సీఎం రేవంత్ ప్రవేశపెట్టనున్న 4 బిల్లులు
మూడు రోజుల విరామం అనంతరం తెలంగాణ శాసనసభ సమావేశాలు ఇవాళ (జనవరి 02, శుక్రవారం) తిరిగి ప్రారంభమయ్యాయి. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ఉత్కంఠభరితంగా, వాడివేడిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పలు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది.
ఈ రోజు మొత్తం ఐదు ముఖ్యమైన బిల్లులను శాసనసభ ముందుకు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా నాలుగు బిల్లులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రవేశపెట్టనున్నారు. మున్సిపాలిటీల నాలుగో సవరణ బిల్లు, జీహెచ్ఎంసీ (GHMC) సవరణ బిల్లు, తెలంగాణ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు–2025లను సభ ఆమోదానికి ఉంచనున్నారు.
అదేవిధంగా మోటార్ వెహికల్స్ టాక్సేషన్ సవరణ బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్ సభలో ప్రవేశపెట్టనున్నారు. మోటార్ వెహికల్స్ టాక్సేషన్‌కు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్లను కూడా శాసనసభ ముందు ఉంచనున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, ఇవాళ ఉపాధి హామీ పథకం పేరుమార్పుపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఈ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య ఆసక్తికర చర్చ జరిగే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
మొత్తంగా ఇవాళ్టి అసెంబ్లీ సమావేశాలు కీలక నిర్ణయాలకు వేదికగా మారనున్నాయని అంచనా.