Talasani: రేవంత్ రైతాంగానికి క్షమాపణ చెప్పాలి
Talasani: రేవంత్ వ్యాఖ్యలను సమర్థించిన వారికి పుట్టగతులుండవు
Talasani: రేవంత్ రైతాంగానికి క్షమాపణ చెప్పాలి
Talasani: రేవంత్ రెడ్డి తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. తాను మునుగుతా... మీరందరు మునగండి అనే విధంగా రేవంత్ వ్యవహారం ఉందన్నారు. రేవంత్ వ్యాఖ్యలను సమర్థిస్తే కాంగ్రెస్ నాయకులకు పుట్టగతులుండవన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎన్ని గంటలు కరెంటు ఇచ్చారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 9 సంవత్సరాలుగా రైతులు ధీమాగా ఉన్నారని చెప్పారు.