Lockdown in Telangana: లాక్‌డౌన్‌ మరింత కఠినతరం చేయండి- డీజీపీ ఆదేశం

Lockdown in Telangana: తెలంగాణలో అమలవుతున్న లాక్‌డౌన్‌పై రాష్ట్ర డీజీపీ మహేందర్‌ రెడ్డి సీపీ, ఐజీ, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

Update: 2021-05-19 16:15 GMT

డీజీపీ మహేందర్‌ రెడ్డి(ఫైల్ ఇమేజ్ )

Lockdown in Telangana: తెలంగాణలో అమలవుతున్న లాక్‌డౌన్‌పై రాష్ట్ర డీజీపీ మహేందర్‌ రెడ్డి సీపీ, ఐజీ, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలుచేయాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డీజీపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలు తీరును ప్రతిరోజు జిల్లాల వారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షిస్తున్నారు అని తెలిపారు. మే 30 వ తేదీ తరవాత తిరిగి లాక్‌డౌన్‌ను పొడగించేందుకు వీలులేకుండా ప్రస్తుత లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని తెలిపారు.

ఉదయం 6గంటల నుంచి 10 గంటల వరకు లాక్‌డౌన్ సడలింపు ఉన్నప్పటికీ 8 గంటల తర్వాతే ప్రజలు నిత్యావసరాలకై వస్తున్నారని అన్నారు. మార్కెట్లు, దుకాణాల వద్ద పెద్ద ఎత్తున ప్రజలు గుమికూడటం కనిపిస్తుందని, దీనిని నివారించేందుకు ఉదయం 6 గంటల నుండే తమ అవసరాలకై వెళ్లే విధంగా ప్రజలను చైతన్య పర్చాలని సూచించారు. 10 గంటల అనంతరం వీధుల్లో పెద్ద ఎత్తున జనసంచారం ఉంటుందని, దీనిని నివారించేందుకై సరైన చర్యలు చేపట్టాలని డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. ఉదయం 10 గంటల అనంతరం అనుమతిలేని వాహనాలు సంచరిస్తే వాటిని వెంటనే తాత్కాలికంగా సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Tags:    

Similar News