Singer Sunitha Marriage: ఘనంగా సింగర్ సునీత వివాహం
కొద్దిమంది సమక్షంలో వివాహం చేసుకున్న సునీత
singer Sunitha marriage
టాలీవుడ్ సింగర్ సునీత పెళ్లి రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కుడ గ్రామ సమీపంలో ఉన్న అమ్మపల్లి దేవాలయంలో ఘనంగా జరిగింది. కోవిడ్ నేపథ్యంలో సన్నిహితుల మధ్యే సింగర్ పెళ్లి చేసుకున్నారు. బిజినెస్ మ్యాన్ రామ్ వీరపనేనితో సునీత ఏడడుగులు వేసింది. పెళ్లికి ఇండస్ట్రీ నుంచి అతికొద్ది మాత్రమే పాల్గొన్నారు. తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయకర్ రావు సునీత వివాహంలో పాల్గొన్నారు.