Nizamabad: మంత్రి హరీశ్‌ రావుకు నిరసన సెగ

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన మంత్రి హరీశ్‌ రావుకు నిరసన సెగ తగిలింది.

Update: 2022-06-18 13:45 GMT

Nizamabad: మంత్రి హరీశ్‌ రావుకు నిరసన సెగ

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన మంత్రి హరీశ్‌ రావుకు నిరసన సెగ తగిలింది. ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు వచ్చిన హరీశ్‌ రావు కాన్వాయ్ ను విద్యార్ధి సంఘాలు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. త్రిబుల్ ఐటీ సమస్యలపై స్పందించాలని విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేశాయి. అడ్డుకున్న విద్యార్ధులను అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్ కు తరలించారు.

ఆర్మీని ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతోందని మంత్రి హరీశ్‌ రావు ఆరోపించారు. అగ్నిపథ్‌తో ఆర్మీ ఉద్యోగాలకు కేంద్రం మంగళం పాడుతోందన్నారు. సికింద్రాబాద్‌లో దాడుల వెనుక టీఆర్‌ఎస్ హస్తం ఉంటే యూపీలో జరిగిన ఆందోళనలో ఎవరి హస్తం ఉన్నట్లని ప్రశ్నించారు. బీజేపీ బండి సంజయ్, డీకె అరుణలు అవగాహన లేమితో మాట్లాడుతున్నారని ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం మోతె గ్రామంలో 1.30 కోట్లతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. బీజేపీ మాటలు తీయగా చేతలు మాత్రం చేదుగా ఉన్నాయని మండిపడ్డారు.

Tags:    

Similar News