Srisailam Fire Accident : శ్రీశైలం జెన్కో ప్రమాదం ఫై కొనసాగుతున్న విచారణ

Srisailam Fire Accident : నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమల పెంట శ్రీశైలం ఎడమ గట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

Update: 2020-08-23 05:52 GMT

అగ్ని ప్రమాద దృష్యం

Srisailam Fire Accident : నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమల పెంట శ్రీశైలం ఎడమ గట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ ప్రమాదంపై విచారణను సీఐడీ కొనసాగిస్తుంది. సీఐడీ ఛీఫ్ గోవింద్ సింగ్ , డిఐజి సుమతి నేతృత్వంలో ఈ విచారణ కొనసాగుతుంది. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందన్న ప్రాధమిక అంచనా కొచ్చింది. దీంతో సీఐడీ దర్యాప్తు బృందం షార్ట్ సర్క్యూట్ కి గల కారణాలను విశ్లేషించనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రమాదం జరిగిన స్థలంలో ప్రాధమిక సాక్ష్యాలను దర్యాప్తు బృందం సేకరించింది. కాలి పోయున వైర్ లతో పాటు పవర్ సప్లై కు ఉపయోగించిన వైర్లు, కాలిన పదార్థాలను ఫోరెన్సిక్ బృందం సీజ్ చేసింది.

మరో వైపు టెక్నీకల్ బృందాలు పవర్ జనరేషన్, సప్లై ఎలా జరిగిందో వీడియో గ్రఫీ చేసారు. దీంతో సీఐడీ పవర్ సప్లై ఎలా జరిగిందో వివరాలను తెలుసుకున్నారు. అనంతరం సీఐడీ అధికారులు స్టేట్మెంట్ లను రికార్డ్ చేసారు. మొదట ఫైర్ యాక్సిడెంట్ ఆయిన చోట ఫ్లోర్ పగిలి ఉన్న ప్లేస్ లో ఉన్న పదార్థాలను సేకరించారు. అదే విదంగా సీఐడీ టెక్నీకల్ బృందాలు కాలిన పదార్థాలలో వాటర్ ఉందా లేదా అన్న విషయాన్ని విశ్లేషించనున్నారు. గతంలో జరిగిన ప్రమాదాలతో ఈ ప్రమాదాన్ని పోల్చలేమని సీఐడీ అధికారులు అంటున్నారు. మరికొన్ని సాక్ష్యాల కోసం వారు విచారణ చేపట్టారు. ఈ ప్రమాదం సంబవించడానికి మానవ తప్పిదం ఉందా లేదా అనే విషయాన్ని తేల్చనున్నారు.

ఇక శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్‌ కేంద్రంలో గురువారం రాత్రి చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో ఒక్కసారిగా విద్యుత్‌ కేంద్రంలో పొగలు అలుముకోవడంతో అధికారులు వెంటనే ఉత్పత్తిని నిలిపివేశారు. మంట‌లు ఆరిపోగా పొగ‌లు మాత్రం ద‌ట్టంగా అలుముకున్నాయి. విద్యుత్ కేంద్రం నుంచి 8 మంది సుర‌క్షితంగా బ‌య‌ట‌కు రాగా మ‌రో 9 మంది అందులోనే చిక్కుకుపోయారు. పవర్ ప్లాంట్ లోపల చిక్కుకున్న 9 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి.

Tags:    

Similar News