Sridhar Babu: పేదల ముఖంలో చిరునవ్వు చూడాలనే ఆరు గ్యారంటీలను ప్రవేశపెట్టాం

Sridhar Babu: ఎక్కడా అవినీతి జరగకుండా చర్యలు తీసుకుంటాం

Update: 2023-12-30 08:53 GMT

Sridhar Babu: పేదల ముఖంలో చిరునవ్వు చూడాలనే ఆరు గ్యారంటీలను ప్రవేశపెట్టాం

Sridhar Babu: పేదల ముఖంలో చిరునవ్వు చూడాలనే ఉద్దేశంతో ఆరు గ్యారెంటీలను ప్రవేశపెట్టామని మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలో ఆరు గ్యారెంటీల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మంత్రి అయిన తర్వాత సొంత గ్రామమైన ధన్వాడకు మొదటి సారిగా వచ్చిన ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడిన మంత్రి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రతీ ఒక్కరూ ఆరు గ్యారంటీల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నఆయన.. ఎక్కడా అవినీతి జరుగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Tags:    

Similar News