Narsingi: శ్రీ చైతన్య కాలేజీలో విషాదం

Narsingi: హైదరాబాద్‌లోని నార్సింగిలో ఓ ఇంటర్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Update: 2023-03-01 04:38 GMT

Narsingi: శ్రీ చైతన్య కాలేజీలో విషాదం

Narsingi: హైదరాబాద్‌లోని నార్సింగిలో ఓ ఇంటర్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. శ్రీచైతన్య కాలేజ్‌లో ఇంటర్ చదువుతున్న సాత్విక్.. మంగళవారం రాత్రి 10 గంటల 30 నిమిషాలకు క్లాస్‌రూమ్‌లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన తోటి విద్యార్థులు సాత్విక్‌ను హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఆస్పత్రికి వెళ్లే లోపే సాత్విక్ మృతిచెందగా.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. సాత్విక్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నపుడు కూడా సిబ్బంది పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు విద్యార్థులు. కనీసం హాస్పిటల్‌కు తరలించలేదని.. బయట వాహనాలను ఆపి హాస్పిటల్‌కు తీసుకెళ్లామని చెబుతున్నారు.

Tags:    

Similar News