హైదరాబాద్ శివారులో ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియ స్పీడప్

*రంగారెడ్డి జిల్లా పరిధిలోని తొర్రూర్‌లో..117 ఎకరాల్లో లే అవుట్‌లు

Update: 2022-06-08 05:55 GMT

హైదరాబాద్ శివారులో ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియ స్పీడప్

Hyderabad: హైదరాబాద్ నగర శివారు ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియ వేగవంతం అయ్యింది. నగర శివారు ప్రాంతాలైన బహదూర్‌పల్లి, తొర్రూర్, తుర్కయాంజల్, దుండిగల్‌లలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ అభివృద్ధి చేసిన లే అవుట్లలో రెండో విడత ప్లాట్లను వేలం వేయనున్నారు. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో జరగబోయే వేలంలో ప్లాట్ల సైజ్‌లు, రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ భూముల వేలానికి కంకణం కట్టుకున్నారు. హెచ్‌ఎండీఏ నేతృత్వంలో మొదట హైదరాబాద్ చుట్టుపక్కల భూములను వేలం వేయనున్నారు. జూన్ 30వ తేదీన బహదూర్‌పల్లిలోని 51 ప్లాట్లకు జూలై 1,2,4వ తేదీల్లో తొర్రూర్‌లోని 148 ప్లాట్లకు ఆన్‌లైన్‌ వేలం వేయనున్నారు. మేడ్చల్ జిల్లా పరిధిలోని బహదూర్‌పల్లిలో 40 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన లే అవుట్‌లో మొత్తం 101 ప్లాట్లు ఉండగా గతంలో 50 ప్లాట్లను మొదటి దశలో విక్రయించనున్నారు. రెండో దశలో మిగిలిన ప్లాట్లకు వేలం వేస్తున్నారు. అదే విధంగా రంగారెడ్డి జిల్లా పరిధిలోని తొర్రూర్‌లో 117 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న లే అవుట్‌లో 223 ప్లాట్లను మొదటి దశలో విక్రయించగా రెండో దశలో 148 ప్లాట్లను విక్రయించనున్నారు.

ప్లాట్ల విక్రయాన్ని పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎంఎస్‌టీసీ లిమిటెడ్ ఈ- ఆక్షన్ ద్వారా విక్రయించేలా ఏర్పాట్లు చేశారు. ప్లాట్ల వేలానికి నోటిఫికేషన్ జారీ చేసి కొనుగోలు చేసే వారి పేర్ల నమోదు ప్రక్రియ, ప్రీబిడ్ మీటింగ్స్, ఈఎండీల చెల్లింపుల ప్రక్రియను నెల రోజుల పాటు నిర్వహించి, ఈ నెలాఖరులో ఆన్‌లైన్‌ వేలం చేపట్టనున్నారు. బహదూర్‌పల్లి లే అవుట్‌లో చదరపు గజానికి నిర్ధారించిన కనీస ధరను 25వేలుగా, తొర్రూర్‌లో చదరపు గజానికి 20వేలుగా నిర్ణయించారు. చదరపు గజానికి కనీస బిడ్ పెంపుదల 500 రూపాయల చొప్పున పెంచాల్సి ఉంటుంది.

ఇప్పటికే ప్రభుత్వ భూముల కొనుగోలు విషయంలో సందేహాలను నివృత్తి చేసిన హెచ్‌ఎండీఏ అధికారులు రెండో ప్రి బిడ్‌ను విజయవంతం చేస్తామంటున్నారు. కచ్చితంగా అర్హులకు ఈ ప్లా్ట్లు దక్కేలా చూసే అవసరం హెచ్‌ఎండీఏ అధికారులపై ఉంది.

Tags:    

Similar News