Gutha Sukender Reddy: రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్న వాళ్లం.. జాగ్రత్తగా ఉండాలి
Gutha Sukender Reddy: గాంధీ గుర్తుగా అన్ని సమస్యలు సర్దుకుంటాయని ఆశిస్తున్నాం
Gutha Sukender Reddy: రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్న వాళ్లం.. జాగ్రత్తగా ఉండాలి
Gutha Sukender Reddy: మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి నివాళులుర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన గుత్తా సుఖేందర్ రెడ్డి రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్న వాళ్లం జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకునే ధరోణితో ఉండాలని సూచించారు. గాంధీ గుర్తుగా అన్ని సమస్యలు సర్దుకుంటాయని ఆశిస్తున్నామని తెలిపారు. దేశంలో లౌలిక వాదాన్ని కాపాడుకోవాలన్నారు. వక్రబుద్ధితో ఆలోచన చేసే నాయకులకు మంచి ఆలోచన కలిగించాలన్నారు. దేశంలో మతోన్మాద శక్తులు, రకరకాల శక్తులు దేశ అభివృద్ధిలో ఇబ్బంది కలిగిస్తున్నాయన్నారు.