Weather Update: తెలంగాణలో కొనసాగుతున్న నైరుతి రుతుపవనాల తిరోగమనం

Weather Update: తెలంగాణ నుంచి నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

Update: 2025-10-13 12:42 GMT

Weather Update: తెలంగాణలో కొనసాగుతున్న నైరుతి రుతుపవనాల తిరోగమనం

Weather Update: తెలంగాణ నుంచి నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉదయం ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్ వరకు నైరుతి రుతుపవనాలు ఉపసంహరించుకున్నట్లు తెలిపింది. రానున్న 24 గంటలలో తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు అనుకూల వాతావరణం ఉందని వెల్లడించింది. కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు తెలిపింది.

తెలంగాణలో 3 రోజుల పాటు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇవాళ ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి, మహాబూబ్ నగర్తో పాటు కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Tags:    

Similar News