Governor: రిటైర్మెంట్ బెనిఫిట్స్, హెల్త్ బెనిఫిట్స్‌పై ముసాయిదాలో స్పష్టత లేదు.. భవిష్యత్‌లో సమస్యలు రాకూడదనే బిల్లులో స్పష్టత కోరా..

Governor: రిటైర్మెంట్ బెనిఫిట్స్, హెల్త్ బెనిఫిట్స్‌పై ముసాయిదాలో స్పష్టత లేదు.. భవిష్యత్‌లో సమస్యలు రాకూడదనే బిల్లులో స్పష్టత కోరా..

Update: 2023-08-05 11:18 GMT

Governor: రిటైర్మెంట్ బెనిఫిట్స్, హెల్త్ బెనిఫిట్స్‌పై ముసాయిదాలో స్పష‌్టత లేదు.. భవిష్యత్‌లో సమస్యలు రాకూడదనే బిల్లులో స్పష్టత కోరా..

TSRTC Merger Bill: ప్రభుత్వ ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ తమిళిసై తాజాగా స్పందించారు. నిన్న బిల్లు పంపి ఇవాళ సంతకం కావాలంటే కరెక్ట్ కాదని పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు రాకూడదనే బిల్లులో స్పష్టత కోరుతున్నట్లు చెప్పారు. ఏ బిల్లులోనైనా నిబంధనల ప్రకారమే వెళ్తున్నామని తెలిపారు. రాజ్యాంగం ప్రకారమే ప్రభుత్వాన్ని క్లారిటీ అడుగుతున్నారని తెలిపారు. కార్మికులకు వివిధ రూపాల్లో రావాల్సిన బకాయిలు, నిధుల గురించి ప్రభుత్వాన్ని అడిగామన్నారు.

బిల్లుపై రాజ్‌ భవన్‌కు నిరసనగా వచ్చారో అలాగే ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని సూచించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, హెల్త్ బెనిఫిట్స్‌పై ముసాయిదాలో స్పష‌్టత లేదని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులు భవిష్యత్ హక్కుల కోసం అడగటం న్యాయమే కానీ.. బకాయిల విషయంలో పోరాట స్ఫూర్తిని ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు. బిల్లులో స్పష్టత లేదని .. గవర్నర్ అడుగుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన అంశాల విషయంలో స్పష్టత కోసమే ఆపానని.. మరో ఉద్దేశం లేదని గవర్నర్ చెప్పారు. 

Tags:    

Similar News