తాండూర్‌లో దారుణం.. ఆస్తి కోసం మామపై పెట్రోల్ పోసి నిప్పంటించిన అల్లుడు
వికారాబాద్ జిల్లాలో మామపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన కలకలం రేపుతుంది. 2 ఎకరాల పొలంతో పాటు ఇల్లు ఇవ్వనందుకు కక్ష పెంచుకున్నాడు ఓ అల్లుడు.
తాండూర్‌లో దారుణం.. ఆస్తి కోసం మామపై పెట్రోల్ పోసి నిప్పంటించిన అల్లుడు
వికారాబాద్ జిల్లాలో మామపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన కలకలం రేపుతుంది. 2 ఎకరాల పొలంతో పాటు ఇల్లు ఇవ్వనందుకు కక్ష పెంచుకున్నాడు ఓ అల్లుడు. యాలాల మండలం బెన్నూర్‌లో నివాసముంటున్న కృష్ణ తన కూతురుని కర్ణాటకకు చెందిన అర్జున్‌కు ఇచ్చి వివాహం చేశాడు. అయితే మామ పేరుపై ఉన్న 2 ఎకరాల పొలం, ఒక ఇల్లు తమకు ఇవ్వాలంటూ అల్లుడు, కూతురు కృష్ణపై ఒత్తిడి తెచ్చారు.
ఈ క్రమంలో వారి మధ్య తరుచూ గొడవలు జరిగేవని స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆస్తి కోసం తన మామపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు అల్లుడు. దీంతో గాయాల పాలైన కృష్ణను తాండూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు స్థానికులు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు కూతురు అనిత, అర్జున్‌పై యాలాల పోలీసులు కేసు నమోదు చేశారు.