MLA Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దూకుడు

* నందకుమార్‌కు సంబంధించిన వివరాలపై భార్య చిత్రలేఖను ప్రశ్నించనున్న సిట్

Update: 2022-11-25 03:08 GMT

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దూకుడు

MLA Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దూకుడు పెంచింది. వరుస విచారణలతో సిట్ అధికారులు కేసులో స్పీడ్ పెంచారు. ఇవాళ న్యాయవాది ప్రతాప్, నందకుమార్ భార్య చిత్రలేఖ విచారణకు హాజరుకానున్నారు. నందకుమార్, సింహయాజీ, రామచంద్రభారతిలతో ఉన్న సంబంధాలపై న్యాయవాది ప్రతాప్‌గౌడ్‌ను సిట్ ప్రశ్నించనుంది. అలాగే నందకుమార్‌కు సంబంధించిన వివరాలపై అతని భార్య చిత్రలేఖను సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు.

ఇప్పటికే బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామి, శ్రీనివాస్‌లను నిందితులుగా FIR లో చేర్చిన సిట్ అధికారులు జగ్గు్స్వామి, తుషార్‌లకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఈనెల 29న విచారణకు రావాలని ఏపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సిట్ ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు బీఎల్ సంతోష్‌కు 41ఏ నోటీసులు జారీ చేసింది. ఈనెల 26 లేదా 28న సంతోష్ విచారణకు హాజరుకావాలని సిట్ ఆదేశించింది. మరోవైపు ఇవాళ న్యాయవాది ప్రతాప్, నందకుమార్ భార్య చిత్రలేఖల నుంచి మరింత సమాచారం రాబట్టాలని సిట్ భావిస్తోంది.

Tags:    

Similar News