Peddapalli: అన్నా.. ఇదే నీకు కట్టే చివరి రాఖీ.. సోదరుడి మృతదేహాన్ని పట్టుకుని గుండెలవిసేలా రోదించిన చెల్లెలు
Peddapalli: శోకసంద్రంలో మునిగిపోయిన కనుకయ్య కుటుంబం
Peddapalli: అన్నా.. ఇదే నీకు కట్టే చివరి రాఖీ.. సోదరుడి మృతదేహాన్ని పట్టుకుని గుండెలవిసేలా రోదించిన చెల్లెలు
Peddapalli: పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం దూళికట్టలో విషాద ఘటన జరిగింది. రాఖీ పండగ సందర్భంగా సోదరుడికి రాఖీ కట్టేందుకు వచ్చిన ఆ సోదరికి ఊహించని ఘటన ఎదురైంది. గుండెపోటుతో మరణించిన సోదరుడికి రాఖీ కట్టింది ఓ సోదరి. ఈ హృదయ విదారక ఘటన అక్కడున్న వారందరిని కన్నీటి పర్యంతమయ్యేలా చేసింది. కనకయ్య అనే వ్యక్తి గుండెపోటుతో మరణించడంతో ఆ కుటుంబం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. రాఖీ పండగకు ఇంటికి వచ్చిన సోదరి గౌరమ్మ తన అన్న మరణాన్ని తట్టుకోలేకపోయింది. కన్నీళ్లను దిగమింగుతూ గుండెనిండా భారాన్ని మోస్తూ తన అన్నకు రాఖీ కట్టింది.