అక్కను హతమార్చేందుకు సుపారీ ఇచ్చిన చెల్లి.. తృటిలో తప్పించుకొన్న బాధితురాలు..

Property Dispute: సొంత అక్కను హతమార్చేందుకు.. సుపారీ ఇచ్చిన చెల్లి వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది.

Update: 2022-01-28 10:24 GMT

అక్కను హతమార్చేందుకు సుపారీ ఇచ్చిన చెల్లి.. తృటిలో తప్పించుకొన్న బాధితురాలు..

Property Dispute: సొంత అక్కను హతమార్చేందుకు.. సుపారీ ఇచ్చిన చెల్లి వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. అయితే కిరాయి గూండాల నుంచి తృటిలో తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్ లో తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు చెప్పిన వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ కు చెందిన తాటికొండ పుష్పమణి, సింధూర అక్కాచెల్లెళు. వీరికి విజయవాడలోని 2 కోట్లకు పైగా విలువైన భూమిపై వివాదాలు తలెత్తాయి. భూ తగాదాల కారణంగా అక్కపై కోపం పెంచుకున్న చెల్లి సింధూర భర్త శ్రీనాథ్ సాయంతో అక్కను చంపించేందుకు కట్ర పన్నినట్టు పోలీసులు వెల్లడించారు. ఇందుకు 2 లక్షల రూపాయల సుపారీని ఇచ్చి, సఫారీ కారును ఇచ్చిందని పోలీసులు వివరించారు.

పుష్పమణిని చంపేందుకు ఆమెపై నిఘా పెట్టిన సుపారీ గ్యాంగ్ వికారాబాద్ జిల్లాలో ఫామ్ హౌస్ నిర్మాణ పనులపై వెళ్లివస్తున్న ఆమెపై కాపు కాసి దాడి చేశారు. దుండగుల దాడి నుంచి తప్పించుకుని షాబాద్ పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు. పుష్పమణి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేయగా అసలు విషయం బయటపడింది. 

Tags:    

Similar News