Singer Kalpana: మహిళా కమిషన్‌కు సింగర్‌ కల్పన ఫిర్యాదు.. ఏమన్నారంటే

Update: 2025-03-09 04:42 GMT

సింగర్‌ కల్పన ఇటీవల వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరిన కల్పన ప్రస్తుతం కోలుకుంటున్నారు. మందుల డోస్‌ ఎక్కువ కావడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది అంటూ ఆమె క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే కల్పన విజువల్స్‌ బయటకు వచ్చిన వెంటనే ఆమె ఆత్మహత్యాయత్నం చేశారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ముఖ్యంగా సోషల్‌ మీడియాలో ఈ ప్రచారం ఎక్కువగా జరిగింది. అయితే తాను ఆత్మాహత్యాయత్నం చేయలేదని, కేవలం మందుల డోస్‌ ఎక్కువ కావడం వల్లే ఇలా జరిగిందంటూ ఆమె వీడియో సైతం విడుదల చేశారు. అయితే ఈ ప్రచారం ఎంతకూ ఆగకపోయే సరికి కల్పన కీలక నిర్ణయం తీసుకున్నారు.

తనపై అసత్య ప్రచారం జరుగుతున్నట్లు తెలంగాణ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. సోషల్‌మీడియాలో తన గురించి వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు వార్తలు పెడుతున్నారని, వాటిని అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. వర్టెక్స్ ప్రీ వీలేజ్ గేటెడ్ కమ్యూనిటీ అసోసియేషన్ సహాయంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు.

తాను ఆత్మహత్యాయత్నం చేశానంటూ కొన్ని ఛానళ్లు దుష్ప్రచారం చేశాయని కల్పన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో శనివారం తెలంగాణ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ను కలిసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళలపై అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు ఉంటాయని కమిషన్‌ హెచ్చరించింది.

Tags:    

Similar News