Singareni Dasara Bonus: సింగరేణి కార్మికులకు దసరా బోనస్‌.. ఒక్కో కార్మికుడికి రూ.1,95,610 బోనస్‌..

Singareni Dasara Bonus: సింగరేణి కార్మికులకు ఈ దసరాకు భారీ బోనస్‌ను ప్రకటించారు.

Update: 2025-09-22 07:28 GMT

Singareni Dasara Bonus: సింగరేణి కార్మికులకు ఈ దసరాకు భారీ బోనస్‌ను ప్రకటించారు. సంస్థ లాభాల్లో 34 శాతాన్ని కార్మికులకు పంచాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్ణయించారు. ఈ నిర్ణయం ప్రకారం, ఒక్కో కార్మికుడికి రూ.1,95,610 బోనస్‌గా అందజేయనున్నారు.

మొత్తంగా, సింగరేణి సంస్థ ఆర్జించిన రూ.6,394 కోట్ల లాభాల్లోంచి రూ.819 కోట్లు కార్మికులకు పంపిణీ చేయనున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఇది కార్మికుల కష్టానికి తగిన ప్రతిఫలం అని ఆయన పేర్కొన్నారు. దసరా బోనస్‌తో పాటు, దీపావళికి కూడా ప్రత్యేక బోనస్‌ ఇస్తామని ఆయన వెల్లడించారు. ఈ నిర్ణయం సింగరేణి కార్మికుల్లో సంతోషాన్ని నింపింది.

Tags:    

Similar News