గవర్నర్ తమిళిసైకి వైఎస్ షర్మిల లేఖ.. TSPSC బోర్డ్ రద్దుకు రాష్ట్రపతికి సిఫార్సు చేయాలంటూ..
YS Sharmila: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు వైఎస్ షర్మిల లేఖ రాశారు.
గవర్నర్ తమిళిసైకి వైఎస్ షర్మిల లేఖ.. TSPSC బోర్డ్ రద్దుకు రాష్ట్రపతికి సిఫార్సు చేయాలంటూ..
YS Sharmila: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు వైఎస్ షర్మిల లేఖ రాశారు. ఆర్టికల్ 317 ప్రకారం TSPSC బోర్డ్ రద్దుకు రాష్ట్రపతికి సిఫార్సు చేయాలని కోరారు. కొత్త బోర్డ్ వెంటనే ఏర్పాటు చేసేలా చూడాలని విన్నవించారు. దేశంలోనే ఒక కమిషన్ లో జరిగిన అతిపెద్ద స్కాం ఇదని పేర్కొన్నారు. సంతలో సరుకులు అమ్మినట్లుగా కీలకమైన పరీక్షా పేపర్లు అమ్మి 30లక్షల మంది జీవితాలతో చెలగాటం ఆడారని ఆరోపించారు.
పేపర్ లీకుల వెనుక బోర్డ్ చైర్మన్, మెంబర్లు, ఉద్యోగుల నుంచి రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రుల వరకు హస్తం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన TSPSC పూర్తి విశ్వసనీయతను కోల్పోయిందని పేర్కొన్నారు. TSPSC పేపర్ లీకేజీపై రాష్ట్ర ప్రభుత్వ హయాంలో నియమించిన సిట్ పనితీరు నమ్మశక్యంగా లేదని తెలిపారు. కేసును నీరు గార్చే ప్రయత్నాలు సాగుతున్నాయని వై.ఎస్ షర్మిల లేఖలో వివరించారు.