Bichkunda: సేవాభారతి ఆధ్వర్యంలో 20కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణీ

Update: 2020-04-23 16:41 GMT

బిచ్కుంద: మండల కేంద్రంలోని సేవా భారతి ఆధ్యర్యంలో గురువారం గ్రామంలోని 20 నిరుపేద కుటుంబాలకు బిచ్కుంద కాశీ విశ్వనాథ ఆలయ పీఠాధిపతి సోమయప్ప స్వామి చేతుల మీదుగా నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు.

కరోనా వైరస్ నేపథ్యంలో గ్రామంలోని ప్రతి ఒక్కరు తమ ఇండ్లలోనే ఉండాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బిచ్కుంద ఉప సర్పంచ్ నాగరాజు, సేవా భారతి ప్రతినిధులు రచ్చ శివకాంత్, డా.నర్సింలు, యెన్నావార్ జనార్ధన్, రచ్చ శ్రీకాంత్, వాస్రె నాగనాథ్, భానుదాస్, గుడుముల బాలరాజ్ పాల్గొన్నారు. 


Tags:    

Similar News