దమ్ముంటే కేసీఆర్‌ ఎన్నికలకు రావాలని అమిత్ షా పిలుపు

కేసీఆర్‌ను ఓడించడానికి బండి సంజయ్ ఒక్కడు చాలు : అమిత్ షా

Update: 2022-05-15 02:30 GMT

దమ్ముంటే కేసీఆర్‌ ఎన్నికలకు రావాలని అమిత్ షా పిలుపు

Amit Shah: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సహాన్ని తీసుకువచ్చింది. ఈ వేదికపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ ను ఓడించటానికి తాను రావాల్సన అవసరం లేదని.. బండి సంజయ్ ఒక్కడు చాలన్నరు. ముందస్తు ఎన్నికలకు వెళ్ళటానికి కేసీఆర్ భయపడుతున్నాడన్నారి ఎద్దేవా చేశారు. దమ్ముంటే కేసీఆర్ ఎన్నికలకు రావాలన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కోవడానికి బీజేపీ సిద్ధంగా ఉందని సవాల్ చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే మైనారిటీ రిజర్వేషన్లు తీసేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తామన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ తో తెలంగాణ సురక్షితమని హామీ ఇచ్చారు.

ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లను పూర్తిచేయడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని అమిత్ షా అన్నారు. నీళ్ళు, నిధులు, నియామకాలను తెలంగాణలో ఎందుకు అమలు కాలేదని ప్రశ్నించారు. ఏ పంటనైనా కొనుగోలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు. కేంద్ర పథకాలకు కేసీఆర్ కుటుంబ ఫోటోలు వేసుకుని సిగ్గులేకుండా ప్రచారం చేసుకుంటున్నారన్నారు విమర్శించారు. సచివాలయానికి రాని ముఖ్యమంత్రిని పక్కన పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇళ్ళు ఎక్కడున్నాయో కేసీఆర్ చెప్పాలని షా డిమాండ్ చేశారు. సర్పంచ్ లకు లేని అధికారాలు కేసీఆర్ కొడుకు, కూతురుకు ఎందుకని ప్రశ్నించారు.

వచ్చే ఎన్నికలకు ఈ సభ నుంచే క్లారిటీ గా కార్యకర్తలకు అమిత్ షా సూచించారని బీజేపీ నేతలలో చర్చ జరుగుతుంది. బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు లేకుండా అందరూ కలిసికట్టుగా అధికారం తీసుకురావాలని నేతలకు అమిత్ షా సూచించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన నిధులను ప్రతి గడపకు తీసుకువెళ్లాలని బీజేపీ కార్యకర్తలకు అమిత్ షా సూచించారు. అలాగే టీఆర్ఎస్ అవినీతి పాలనపై వివరించాలన్నారు. తుక్కగుడలో ఏర్పాటు చేసిన సభకి పార్టీ అధినాయకత్వం ఊహించిన దానికంటే భారీగా కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు.

Full View


Tags:    

Similar News