వరదలతో అంటు వ్యాదులు ప్రభలే అవకాశం : మంత్రి ఈటెల

Update: 2020-10-20 04:37 GMT

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతుంటే భారీ వర్షాలతో అంటు వ్యాధుల నివారణకు ప్రభుత్వం అప్రమత్తమైంది. సీజనల్ వ్యాధుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి ఈటల రాజేందర్ కోరుతున్నారు. వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశమైన మంత్రి ఈటల సీజనల్ వ్యాధులపై అధికారులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు.

సీజనల్ వ్యాధుల విషయంలో ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ర్ట వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఎడతెరిపి లేకుండా వర్శాలు కురుస్తున్న నేపథ్యంలో అంటు వ్యాదులు ప్రబలే అవకాశాలున్నాయని రాష్ర్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చెబుతున్నారు. ప్రజలు ఎవరూ నిర్లక్ష్యం వహించవద్దన్నారు. జలుబు, జ్వరంతో బాధపడే వారు ఆసుపత్రికి వెళ్లాలని చెప్పారు. పంచాయతీరాజ్, పురపాలక శాఖలతో వైద్య ఆరోగ్య సిబ్బంది కలిసి పని చేయాలన్నారు మంత్రి ఈటెల.

భారీ వర్షాలు మొదలైనప్పటి నుంచి జీహెచ్ఎంసీ పరిధిలో మెడికల్ క్యాంపులు నిర్వహించడంతో పాటు 104 వాహనాల ద్వారా మొబైల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు మంత్రి ఈటెల చెప్పారు. హెల్త్ క్యాంపుల ద్వారా ఇప్పటి వరకు 38 వేల 516 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు సరఫరా చేశామన్నారు. వరద సహాయ, పునరావాస కేంద్రాల్లోనూ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

వరద ప్రభావితప్రాంతాల్లో కలుషిత నీటి ద్వారా వ్యాదులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందును ఆయా ప్రాంతాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, క్లోరినేషన్ టాబ్లెట్లు అందిస్తున్నామని సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆరోగ్య కార్యకర్తలు, ఆశావర్కర్ల ద్వారా గ్రామాల్లో, హైదరాబాద్​లో మైక్ ద్వారా ప్రచారం చేస్తున్నామని మంత్రి ఈటెల వివరించారు.  

Tags:    

Similar News