School Holidays: విద్యార్థులకు శుభవార్త.. నేడు స్కూళ్లకు సెలవు
School Holidays: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసి గిరిజనుల సంస్కృతిక ప్రతీక అయిన నాగోబా జాతర ఎంతో వైభవంగా సాగుతోంది.
Schools Holiday: విద్యార్థులకు గుడ్ న్యూస్..నేడు స్కూల్స్, కాలేజీలకు సెలవు
School Holidays
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసి గిరిజనుల సంస్కృతిక ప్రతీక అయిన నాగోబా జాతర ఎంతో వైభవంగా సాగుతోంది.ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో కొలువై ఉన్న నాగోబాకు మెస్రం వంశ గిరిజనులు సంప్రదాయ పద్దతుల్లో నిర్వహించిన మహాపూజతో ఈ జాతర మహోత్సం షురూ అయ్యింది. ఈ జాతర ఫిబ్రవరి 4వ తేదీ వరకు కొనసాగుతోంది. అయితే ఈ జాతరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు 6 రాష్ట్రాల నుంచి మెస్రం వంశ గిరిజనులు తరలివచ్చి నాగోబాను దర్శించుకుని ముక్కులు తీర్చుకుంటారు.
ప్రతి ఏడాది పుష్య అమావాస్యకు ఈ పూజ చేస్తారు. అయితే జాతర మొదలైన మూడు రోజులకు గిరిజన దర్బార్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈనెల 31వ తేదీన ఈ దర్బారును ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన గిరిజనులు తమ సమస్యలను ఈ దర్బారుకు హాజరయ్యే మంత్రులు, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధుల ముందుకు తీసుకెళ్లి పరిష్కారం పొందుతున్నారు. కొన్ని సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అవుతుండగా..మరికొన్ని మంత్రుల ద్వారా ప్రభుత్వం దృష్టికి పరిష్కారం పొందుతున్నారు. అయితే ఈనెల 31వ తేదీన దర్బార్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
శుక్రవారం ప్రకటించిన సెలవుగా బదులుగా మార్చి 8వ తేదీ రెండవ శనివారం ప్రభుత్వం, ప్రైవేట్ పాఠశాలలు యాధావిధిగా పనిచేస్తాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా శుక్రవారం సెలవు రోజు కావడంతో జిల్లాలోని గిరిజనులే కాకుండా గిరిజనేతరులు కూడా భారీ సంఖ్యలో కేస్లాపూర్ కు వెళ్లి నాగోబాను దర్శించుకోనున్నారు. దర్బార్ రోజు కేస్లాపూర్ గిరిజనం పోటెత్తడం ప్రతిఏటా జరుగుతుంది. దర్బార్ సందర్బంగా కేస్లాపూర్ లో పలు ప్రభుత్వ శాఖ ఆధ్వర్యంలో స్టాళ్లను కూడా ఏర్పాటు చేశారు. జాతరకు వచ్చే గిరిజనుల నుంచి అర్జీలను స్వీకరించేందుకు ప్రత్యేకంగా కౌంటర్ ను కూడా ఏర్పాటు చేశారు.