Ethanol Factory: దిలావర్ పుర్ లో ఇథనాల్ ఫ్యాక్టరీ పనుల నిలిపివేత: కలెక్టర్

Ethanol Factory: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని దిలావర్ పూర్ లో ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చినట్టుగా జిల్లా కలెక్టర్ అభినవ్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజులుగా స్థానికులు ఈ ఫ్యాక్టరీ పనులను నిలిపివేయాలని ఆందోళనలు చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీకి అనుమతులు వచ్చాయి

Adilabad collector Abhinav orders  to stop ehanol factory works
X

దిలావర్ పుర్ లో ఇథనాల్ ఫ్యాక్టరీ పనుల నిలిపివేత: కలెక్టర్

Ethanol Factory: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని దిలావర్ పూర్ లో ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చినట్టుగా జిల్లా కలెక్టర్ అభినవ్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజులుగా స్థానికులు ఈ ఫ్యాక్టరీ పనులను నిలిపివేయాలని ఆందోళనలు చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీకి అనుమతులు వచ్చాయి. అయితే ఈ ఫ్యాక్టరీ అనుమతులపై ప్రభుత్వం పున:సమీక్ష చేయాలని నిర్ణయానికి వచ్చింది.

ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా నిర్మల్-భైంసా హైవేపై స్థానికులు ఆందోళనకు దిగారు. పురుగుల మందుల డబ్బాతో మహిళలు ఆందోళనలు చేశారు. కొందరిని పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేయడంతో ఆందోళనకారులు దాడికి దిగారు. పోలీసుల వాహనాలపై రాళ్లు రువ్వారు. కలెక్టర్ వచ్చి తమ డిమాండ్లపై స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. గ్రామస్తులతో కలెక్టర్ చర్చలు జరిపారు. ఈ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చినట్టుగా కలెక్టర్ గ్రామస్తులకు చెప్పడంతో వారు శాంతించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story