Telangana Schools: ఫిబ్రవరి నుంచి ఆన్‌లైన్ క్లాసులు తప్పవా?
Online Classes: తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్ధల సెలవుల పొడగింపు ఉంటుందా లేదా అనే ఉత్కఠకు తెరపడింది.
Telangana Schools: ఫిబ్రవరి నుంచి ఆన్‌లైన్ క్లాసులు తప్పవా?
Online Classes: తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్ధల సెలవుల పొడగింపు ఉంటుందా లేదా అనే ఉత్కఠకు తెరపడింది. ఈ నెల 30 వరకు సెలవులను పొడగిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో సెలవులను పొడగిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. ఫిబ్రవరి ఫస్ట్ నుంచి ఆన్ లైన్ తరగతులపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందనేది మరో ఉత్కంఠ కొనసాగుతోంది. మరో వైపు రేపు జరగనున్న కేబినెట్ భేటీలో ఏం ప్రకటిస్తుందో అన్నది వేచి చూడాలి
రేపు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానుంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, పలు అంశాలపై చర్చించనున్నారు.