School Holiday: నేడు స్కూళ్లు, కాలేజీలు బంద్
School Holiday: విద్యా రంగంలో కొనసాగుతున్న సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు నేడు (బుధవారం) రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి.
School Holiday: నేడు స్కూళ్లు, కాలేజీలు బంద్
School Holiday: విద్యా రంగంలో కొనసాగుతున్న సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు నేడు (బుధవారం) రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ మేరకు ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ, ఏఐడీఎస్‌ఓ, ఏఐఎస్్బీ, ఏఐఎఫ్‌డీఎస్, ఏఐపీఎస్‌యూ వంటి విద్యార్థి సంఘాల ప్రతినిధులు మంగళవారం సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు.
ప్రధాన డిమాండ్లు ఇవే
రాష్ట్ర విద్యాశాఖకు తక్షణమే మంత్రి నియామకం
ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలపై ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావడం
ఖాళీగా ఉన్న టీచర్, ఎంఈఓ, డీఈఓ, లెక్చరర్, ప్రిన్సిపాల్ పోస్టుల భర్తీ
అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులాల కోసం సొంత భవనాల నిర్మాణం
గురుకులాల సమయాల్లో శాస్త్రీయ మార్పులు
పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల
విద్యార్థి సంఘాలు ఈ మేరకు విద్యాశాఖ అధికారులకు వినతిపత్రాలు అందజేస్తామంటూ ప్రకటించాయి. విద్యార్థుల భవిష్యత్‌కు తగిన ప్రాధాన్యం ఇవ్వాలన్నది వారి ప్రధాన డిమాండ్.
తల్లిదండ్రుల్లో గందరగోళం
బంద్ పిలుపు నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీల యాజమాన్యాలు మంగళవారం సాయంత్రం నుంచే తల్లిదండ్రులకు తరగతులు ఉండవని, పిల్లలను పంపవద్దని సందేశాలు పంపించాయి. అయితే అన్ని స్కూళ్ల నుంచి ఒకే రకమైన సమాచారం అందకపోవడంతో తల్లిదండ్రుల్లో అసమంజసం నెలకొంది. బుధవారం బడికి పంపాలా? వద్దా? అనే సందిగ్ధంలో వారు ఉన్నారు. కొన్ని స్కూళ్లకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, మరికొన్ని స్కూళ్ల నుంచి సమాచారం లేకపోవడం దీనికి కారణమైంది.