School Holiday: గుడ్ న్యూస్.. జూలై 23న స్కూళ్లకు, కాలేజీలకు సెలవు
School Holiday: తెలంగాణ రాష్ట్రంలో జూలై 23న విద్యాసంస్థలు బంద్ కానున్నాయి. దీంతో విద్యార్దులకు మరో సెలవు రానుంది.
School Holiday: గుడ్ న్యూస్.. జూలై 23న స్కూళ్లకు, కాలేజీలకు సెలవు
School Holiday: శని,ఆదివారంతో పాటు బోనాలు కారణంగా సోమవారం కూడా సెలవు రావడంతో వరుసగా ఏకంగా 3 రోజులు విద్యార్దులకు సెలవులు వచ్చాయి. అయితే ఇప్పుడు జూలై 23న అంటే బుధవారం మరో సెలవు రానుంది. అయితే దానికి కారణం ఏంటంటే..
తెలంగాణ రాష్ట్రంలో జూలై 23న విద్యాసంస్థలు బంద్ కానున్నాయి. దీంతో విద్యార్దులకు మరో సెలవు రానుంది. అయితే దీనికి కారణం ఏంటంటే.. విద్యార్ధుల సమస్యలు, ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా విద్యార్ధి సంఘాలు చేస్తున్న నిరసన కారణంగా పాఠశాలలు మూసివేయనున్నారు.
విద్యార్దులు సంఘాలైన ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, ఏఐవైఎఫ్ కలిసి తెలంగాణ రాష్ట్రమంతా ఈ బంద్‌ను నిర్వహించాలని పిలుపునిచ్చాయి. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్‌తో విద్యాసంస్థలను మూసివేయనున్నట్టు విద్యార్ధి సంఘాలు ప్రకటించాయి.
ఈ సంఘాలు డిమాండ్ చేస్తున్నవి ఏంటంటే.. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు కరెక్ట్‌గా లేకపోవడంతో విద్యార్ధులకు పాఠాలు చెప్పడం కష్టమవుతోంది. అందుకే ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, ఎమ్‌ఇవో, డిఇవో పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే ప్రయివేట్ స్కూళ్లు, కాలేజీలు ఫీజుల పేరుతో తల్లిదండ్రుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని దీన్ని నియంత్రించడం కోసం ప్రత్యేకమైన నియంత్రణ చట్టం తీసుకురావాలని కోరుతున్నారు. అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్ షిఫ్‌లను వెంటనే రిలీజ్ చేయడం, విద్యార్దులకు ఉచిత బస్సు ఫెలిసిటీ ఇవ్వడం, పేద కుటుంబ విద్యార్దులకు ఉచిత భోజన పథకాన్ని జూనియర్ కాలేజీలలో కూడా ఏర్పాటు చేయాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ బంద్‌లో తల్లిదండ్రులు, మేథావులు, విద్యావేత్తలు కూడా భాగస్వామ్యం కావాలని కూడా పిలుపునిచ్చారు.